జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా మాజీ ఎంపిటిసి సభ్యులు పెంట లక్ష్మీ - లింబద్రి సౌజన్యంతో వివేకానంద అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 11 వాలీబాల్ జట్లు పాల్గొన్నాయి. వాలీబాల్ పోటిలను నిర్వహుకులు పారంభించారు. వివేకానంద జయంతి సందర్భంగా బహుమతులు అందజేయనున్నారు.