ఐపీఎల్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ వీక్షించేందుకు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా చూడొచ్చని తెలిపింది. ఎంపిక చేసిన ప్లాన్లపై జియో యూజర్లు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చని ప్రకటించింది.