యూత్ కాంగ్రెస్ బాన్సువాడ అధ్యక్షుడిగా బాన్సువాడకు చెందిన షోహెబ్ ఎన్నికవడంతో శుక్రవారం భాగ్బన్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా షోహెబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్బన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ కాజీమ్, అడ్వైజర్ అశ్వక్, యూత్ ప్రెసిడెంట్ ఫాజిల్, అజీమ్, మైను, భాగ్బన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.