కామారెడ్డి జిల్లా జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ తెలిపారు. వార్త కవరేజ్ కి వెళ్ళినా విలేకరులపై ఆయన దాడి చేయడం సరికాదన్నారు. తక్షణమే మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.