బోర్లoలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

84చూసినవారు
బోర్లoలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం గ్రామ ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు డ్రాయింగ్, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్