రోడ్డుపై నిలిచిన వర్షం నీరు...ఇబ్బంది పడుతున్న ప్రజలు

78చూసినవారు
రోడ్డుపై నిలిచిన వర్షం నీరు...ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఇటీవల కురిసిన వర్షానికి బాన్సువాడ పట్టణంలోని 15 వ వార్డు కట్కే గల్లీ రోడ్డులో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డులో గుంతపడటంతో కురిసిన వర్షం నీరంతా అక్కడికి చేరి నిలిచి పోయింది. రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న ప్రజలు మురుగునీటి కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. అయినా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్