ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, సయ్యద్, సంతోష్ గౌడ్, కమర్ అలీ, అనిల్, కళ్యాణి, రాజేశ్వరి, గంగారం, నరసవ్వ, తదితరులు పాల్గొన్నారు.