బాన్సువాడ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలు, మద్యం విక్రయాలు మూసివేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా తమ దుకాణాలను తెరిచి మాంసం విక్రయాలు జరపడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మాంసం విక్రయాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.