జుక్కల్ సెగ్మెంట్లోని పిట్లం మండలం తిమ్మానగర్ తండా మార్దండా గ్రామానికి చెందిన మల్లయ్య(38)వ్యాయమ ఉపాధ్యాయుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. పెద్ద కొడఫ్గల్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న మల్లయ్య శిక్షణ నిమిత్తం మంగళవారం కామారెడ్డికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.