జుక్కల్: పురాతన కౌలాస్ కోటను సందర్శించిన మంత్రి

51చూసినవారు
జుక్కల్: పురాతన కౌలాస్ కోటను సందర్శించిన మంత్రి
జుక్కల్ మండలంలోని ప్రసిద్దిగాంచిన పురాతన నిర్మాణమైన కౌలాస్ కోటను రాష్ట్ర ఎక్సైజ్ & పర్యాటక శాఖ మరియు నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి సందర్శించారు. మెట్ల మార్గంలో కాలినడకన కోట మీదకు చేరుకున్నారు. కోటలోని పురాతన కట్టడాలు, రాజముద్రలు, భారీ ఫిరంగులు, బురుజులు, దేవాలయాలు మొదలగు వాటిని మంత్రి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్