ఎమ్మెల్యేను సత్కరించిన అంబేద్కర్ సంఘ సభ్యులు

58చూసినవారు
ఎమ్మెల్యేను సత్కరించిన అంబేద్కర్ సంఘ సభ్యులు
జుక్కల్ మండలం గుల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును గురువారం అంబేద్కర్ సంఘ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే మనం స్వేచ్ఛగా ఉన్నామని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన ఓటు ద్వారా నాయకుని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్