పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన స్క్వాడ్ బృందం: ఏడుగురి డిబార్

70చూసినవారు
పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన స్క్వాడ్ బృందం: ఏడుగురి డిబార్
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఏ), ఆదర్శ పాఠశాల/కళాశాల (బి) కేంద్రాల్లో, శనివారం రెండో రోజు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం పూట ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన ప్రత్యేక స్క్వాడ్ బృందం కాపీ చేస్తున్న ఒక్కరినీ పట్టుకుని డిబార్ చేశారు. మధ్యాహ్నం ద్వితీయ ఆంగ్లం పరీక్ష కేంద్రంలో స్క్వాడ్ బృందం కాపీ చేస్తున్న 6గురిని పట్టుకుని డిబార్ చేశారు.

సంబంధిత పోస్ట్