దేవునిపల్లిలో నివాస గుడిసె దగ్ధం

58చూసినవారు
దేవునిపల్లిలో నివాస గుడిసె దగ్ధం
కామారెడ్డిలోని 35వ వార్డులోని (దేవునిపల్లి) హోలియా దాసరి కాలనీలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పెండ్యాల సాయిలుకు చెందిన నివాస గుడిసె దగ్ధమైంది. నిత్యావసరాల సరుకులు, వస్తువులు, ద్విచక్ర వాహనం కాలి పోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటిడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజుపాటిల్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్