శేరిలింగంపల్లి: మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మీల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఈ ఘటనలపై గురువారం మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్ర వెనక ఎవరున్నా వదలేది లేదని హెచ్చరించారు.