ఎల్లారెడ్డి: గ్రామస్థాయి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 4.5 కోట్లు మంజూరు

73చూసినవారు
ఎల్లారెడ్డి: గ్రామస్థాయి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 4.5 కోట్లు మంజూరు
ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో గ్రామీణ స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.4.5 కోట్లు మంజూరు అయినట్లు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ గురువారం తెలిపారు. రోడ్లు పూర్తిగా చెడిపోయిన చోట మొదటి ప్రాధాన్యత నిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలుంటాయన్నారు.

సంబంధిత పోస్ట్