ఎల్లారెడ్డిలో కొందరు వ్యాపారులు రాజకీయనాయకులు రహదారి పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలవల్ల ప్రమాదానికి ఆస్కారం ఉంది. పెద్ద ప్లెక్సీలు రోడ్డుకు అడ్డంగా ఉండటంవల్ల రోడ్లు సరిగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం అంబేద్కర్ చౌరస్తాలో ఓ పెద్ద ప్లెక్సీ వెనుక మంటలు అంటుకోవడంతో సకాలంలో ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయమై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు.