రాష్ట్ర స్థాయి బీసీ యువజన సంఘం సమావేశంలో కామారెడ్డి జిల్లా బీసీ నాయకులు

509చూసినవారు
రాష్ట్ర స్థాయి బీసీ యువజన సంఘం సమావేశంలో కామారెడ్డి జిల్లా బీసీ నాయకులు
బీసీ టైగర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరైన , బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకన్న ఆధ్వర్యంలో కాచిగూడ లోని అభినందన గ్రాండ్ హోటల్ నిర్వహించిన సమావేశానికి కామారెడ్డి జిల్లా నుండి జిల్లా యూత్ అధ్యక్షులు రాజీవ్ కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్ రావు, జిల్లా యువజన నాయకులు ఆడెపు ప్రవీణ్, ప్రశాంత్, సాయి రామ్ పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తున్నాయని బీసీలు సామాజికంగా ఎదగాలంటే యువతకు ఉద్యోగాలు , ఉపాధి కల్పించి మేమెంతో మాకు అంత అన్నట్టుగా 56 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ బిల్లు వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీనికోసం బీసీలందరూ పార్టీలకతీతంగా పోరాటం జరపాల్సిన సమయం ఆసన్నమైందని తెలియపరచారు. అనంతరం జిల్లా నాయకులను శాలువాతో సన్మానించి మేమొంటోలు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్