సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

57చూసినవారు
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
పిట్లం మండల కేంద్రంలో గల రామాలయంలో మొదటి వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 7. 00 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు వుడుగుల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో 32మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్