సదాశివనగర్ మండలంలోని కుప్రియల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని రైతులకు సూచించారు.