విద్యుత్ శాఖలో ప్రీమాన్సూన్ చెకప్

56చూసినవారు
విద్యుత్ శాఖలో ప్రీమాన్సూన్ చెకప్
అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడాని కోసమే ట్రాన్స్ కో అధికారుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలో ప్రీమాన్సూన్ చెకప్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని డివిజనల్ ఆపరేషన్స్ డి ఈ గణేష్ తెలిపారు. ట్రాన్స్ కో ఎస్ఈ. రమేష్ బాబు ఆదేశాల మేరకు, డివిజనల్ ఆపరేషన్స్ డిఈ గణేష్ పర్యవేక్షణలో, మండల ఏఇ సత్యనారాయణ గౌడ్ సారథ్యంలో ఆయా విద్యుత్ సబ్ స్టేషన్ ల వారీగా సరఫరా వ్యవస్థ మెరుగుదలకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్