ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీ అతలాకుతలం అయింది. కాలనీలోని ఇండల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని అనేక ప్రాంతాల వర్షంనీరు బీసీ కాలానికి చేరుతుంది. కాలనీలో మురికి కాల్వలు సరిగా లేకపోవడంతో వర్షానికి నీరు బయటికి వెళ్లకుండా ఇళ్లలోకి వస్తున్నాయని బీసీ కాలనీ వాసులు వాపోయారు. పాలకులకు చెప్పిన పట్టించుకునే దిక్కు లేదంటున్నారు స్థానికులు.