తెలంగాణ తెగువకు చిరునామా చాకలి ఐలమ్మ

59చూసినవారు
తెలంగాణ తెగువకు చిరునామా చాకలి ఐలమ్మ
తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీరవనిత మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని, ఎల్లారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులు పర్వయ్య అన్నారు. మంగళవారం వీరనారి చాకలి ఐల్లమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పర్వయ్యతో పాటు రజక సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం చేసిన పోరాటాన్ని వారు గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్