జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపిడివోగా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో ఆయన బుగ్గారం ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు. విధి నిర్వహణలో నిన్న సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులతో, తన సిబ్బంది తో గడిపిన ఆయన మృతి చెందడంతో ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు