ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని మడుప సత్యనారాయణ ఇంటి వెనుక గల 33 కిలో వాట్ కండక్టర్ వైర్లకు శుక్రవారం పాము తగలడంతో మృతి చెందినది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 33 బి కాల్వ పక్కన అను నిత్యం అనేక రకాల పాములు సంచరిస్తున్న క్రమంలో ఓ పాము విద్యుత్ స్తంభం పై గల ఆర్వైబీ వైర్లలో ఓ వైర్ కు తగలడంతో భారీ శబ్దం వచ్చి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అప్రమత్తమై సరఫరా పునరుద్ధరించారు.