కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాంకేతిక కారణంతో సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయకపోవడంతో కాజీపేట బల్లర్ష మధ్య నడవాల్సిన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పరకాల హుజరాబాద్ ప్రధాన రహదారిపై ఉప్పల్ రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నలింగ్ సమస్య కారణంగా గేటు తెరుచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా వాహనాలు గేటుకి ఇరువైపులా నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది.