జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ నెల 3 న షఖీల్ అనే వినియోగదారుడు ఇక్కడ మిల్క్ కేకు కొనుగొలు చేసి ఇంటికి వెళ్లి చుడగా ఫంగస్ ఉన్నట్టు గుర్తించి షాప్ నిర్వాహకులకు తెలిపాడు వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ 20 బి బ్యాచ్ నంబర్ గల మిల్క్ కేకు లను సీజ్ చేశారు.