కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: సీపీ

77చూసినవారు
కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: సీపీ
లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు 4న ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్