మెట్ పల్లి పట్టణ మున్నూరు కాపు రామ్ నగర్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కూన గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని క్లబ్ లో నిర్వహించిన సంఘ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావులను పూలమాలలు, శాలువాతో సన్మానించారు. మున్నూరు కాపు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని కూన గోవర్ధన్ తెలిపారు.