మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం పుట్టిన రోజు సందర్భంగా కలశాలలో విద్యార్థినులకు సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంటర్ విధ్యాధికారిణి కల్పన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రేమానురాగాల మధ్య ప్రిన్సిపాల్ అరవై ఏళ్ళ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.