మంథని నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఇటీవలె టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. అనంతరం సునీల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చేలా నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణచుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ గడ్డం వివేక్ తో చంద్రుపట్ల సునీల్ రెడ్డి భేటీ అవ్వడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో తెలంగాణ ఉద్యమ నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బిజెపిలో చేరే అంశంపై ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.