మంథనిలో జెడ్పీ చైర్మన్ విస్తృత ప్రచారం

74చూసినవారు
మంథనిలో జెడ్పీ చైర్మన్ విస్తృత ప్రచారం
మంథని మండలం రచ్చపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, ఎక్లాస్ పూర్ గ్రామాల్లో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి కొప్పులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్