పెద్దపల్లి: రూ. 3. 47 కోట్లతో సామగ్రి కొనుగోలుకు ఆమోదం

69చూసినవారు
పెద్దపల్లి: రూ. 3. 47 కోట్లతో సామగ్రి కొనుగోలుకు ఆమోదం
పెద్దపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి బట్టలు, టవల్, బ్లౌజులు, సబ్బులు, నూనె, ఇతరత్రా సామగ్రి కొనుగోలుకు రూ. 3. 47 కోట్లకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా మోబిన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్