మహనీయుల జీవితాల నుంచి అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి అన్నారు. శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒబన్న జీవిత ప్రస్థానాన్ని సిబ్బంది చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డెర సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.