పెద్దపల్లి: పట్టపగలే ఓ యువకుడిపై హత్యాయత్నం

71చూసినవారు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం పట్టపగలే ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో యువకుడిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. స్థానిక వినోభానగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులు గ్రౌండ్‌కు పిలిపించి దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్