వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సతీమణి అనిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత అర్చక స్వాములు వేద పండితులు నాగిరెడ్డి మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, అర్చకులు ఉన్నారు.