వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ఇష్టమైన సోమవారం కావడంతో భక్తుల కుటుంబ సమేతంగా భక్తి భావంతో తరలివచ్చి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అందర్నీ చల్లంగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు