ఏపీలో రూ.99కే క్వార్టర్ మద్యం
ఏపీలో నూతన మద్యం విధానం ద్వారా మద్యం ధరలు తగ్గించారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. వైకాపా హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించేవారు. వాటిని నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం విధించారు. ల్యాండెడ్ కాస్ట్‌పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుంది. దీని ద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.