రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందినటువంటి సోమినేని మౌనిక (30) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కడుపునొప్పి భరించలేక చీరతో ఫ్యానుకు ఊరేసుకొని చనిపోయింది. ఆమె తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.