ఆరు రోజుల్లోనే వేములవాడ రాజన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
వేములవాడ రాజన్న ఆలయంలో 6 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 1 కోటి, 34 లక్షల, 45 వేల, 031 రూపాయలు (1, 34, 45, 031, రూపాయలు) రాగా, కానుకల రూపంలో బంగారం 173 గ్రాముల 000 మిల్లి గ్రాములు, వెండి 011 కిలోలు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ లెక్కింపును ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.