వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని ఆదివారం 40వేల 291మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం ముగియడంతో రేపటి నుంచి ఆలయానికి భక్తులు తాకిడి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.