అన్నపురెడ్డిపల్లి: కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని గుంపెన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. నాణ్యమైన ధాన్యాన్నే కేంద్రాలకు తరలించాలని సూచించారు.