ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నగర అద్యక్షుడు

56చూసినవారు
ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నగర అద్యక్షుడు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం 6వ డివిజన్ రస్తోగి నగర్ లో శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరాన్ని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ ప్రారంభించారు. అనంతరం స్థానిక డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల ఆకాంక్ష కారణంగా నెరవేరిందని పేర్కోన్నారు.

సంబంధిత పోస్ట్