కొత్త బస్టాండ్లో బంగారు గొలుసు చోరీ

55చూసినవారు
కొత్త బస్టాండ్లో బంగారు గొలుసు చోరీ
ఖమ్మం కొత్త బస్టాండ్ లో ఓ మహిళ బ్యాగ్ నుంచి బంగారు గొలుసు చోరీకి గురైంది. ద్వారకానగర్ కు చెందిన రమాదేవి విజయవాడ వెళ్లడానికి సోమవారం బస్టాండ్ కు వచ్చింది. బస్ ఎక్కి చూశాక తన బ్యాగ్ లోని చంద్రహారం పెట్టె ఖాళీగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో సీఐ బాలకృష్ణ, ఎస్ఐ బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. ఆమెతో పాటు అదే బస్సు ఎక్కడానికి వచ్చిన వ్యక్తి గొలుసు చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్