ఇందిరా డెయిరీ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఇందిరమ్మ డెయిరీ, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులపై సమీక్షించారు. ఇందిరమ్మ డెయిరీకి సంబంధించి పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు త్వరగా పూర్తిచేయడమేకాక మధిర నియోజకవర్గంలోని మండలాల్లో మిల్క్ చిల్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తిచేయాలన్నారు.