ఖమ్మంలో లారీ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఓ లారీ అతి వేగంతో వచ్చి అదుపుతప్పి దోరేపల్లి ఫంక్షన్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగిపోయింది. ఆ సమయంలో ఎవరూ అటుగా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.