రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగాలని 239 రోజులుగా దీక్ష చేస్తున్నానని సామాజిక సేవకుడు చిట్టి మల్లు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని వారి నివాసంలో నిరసన చేపట్టారు. కేవలం ఆకులు తింటూ దీక్షను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇటీవల మున్నేరు వరద బాధితులకు సేవలు అందించిన మున్సిపల్, పోలీసు, వివిధ శాఖల అధికారులను సన్మానం చేయాలన్నారు.