ఖరీప్ ధాన్యం సేకరణను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, సహకార, డీఆర్డీఏ, మార్కెటింగ్, జీసీసీ శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సాగవుతున్న వరి వంగడాల వివరాలను సేకరించాలన్నారు. తేమ యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు.