కాలువ గండ్లు పూడ్చడంలో ప్రభుత్వం విఫలం
కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్నెస్పి కాలువకు గండి పడిన ప్రాంతాన్ని సిపిఎం, రైతు సంఘం నాయకుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతూ రాంబాబు మాట్లాడుతూ.. సకాలంలో సాగర్ ఎడమ కాలువ గండ్లు పూడ్చడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. త్వరితగతిన మరమ్మతు పనులు పూర్తి చేసి పాలేరు నుంచి ఎడమ కాలువకు సాగర్ జలాలను విడుదల చేయాలని కోరారు.