గుప్తనిధులకోసం తవ్వకాలు
కూసుమంచి మండలంలోని పెరిక సింగారం రాజుపేట మధ్య ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వారు తవ్వకాలు జరిపినట్లు మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. గర్భగుడి దర్వాజా ముందు ఉన్న పెద్ద బండరాయిని తొలగించి తవ్వకాలు జరిపినట్లు తెలిపారు. ఆలయ ఈఓ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.