అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం మధిర పట్టణంలోని సేవాసదనం ఆశ్రమంలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్‌పాస్ మేళా నిర్వహించారు. డిపో మేనేజర్ శంకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు ఉచితంగా బస్‌పాస్‌లను పంపిణీ చేశారు. ప్రభుత్వం దివ్యాంగుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.